Friday, April 19, 2024

వేసవిలో 22,907 విమాన సర్వీస్‌లు… ఆమోదించిన డీజీసీఏ

ఈ వేసవిలో దేశీయ విమాన సర్వీస్‌ల షెడ్యుల్‌ను డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఆమోదించింది. ఈ సమ్మర్‌ షెడ్యుల్‌ మార్చి 26 నుంచి అక్టోబర్‌ 28 వరకు ఉంటుంది. వింటర్‌ షెడ్యుల్‌ కంటే సమ్మర్‌లో 4.4 శాతం ఎక్కువ సర్వీస్‌లకు అనుమతి ఇచ్చారు. ఈ షెడ్యుల్‌లో మొత్తం 22,907 దేశీయ విమాన సర్వీస్‌లు నడిపేందుకు అనుమతి లభించింది. వారానికి 22,907 విమానా సర్వీస్‌లను 110 ఎయిర్‌పోర్టులను ఆపరేట్‌ చేసేందుకు విమానయాన సంస్థలకు డీజీసీఏ అనుమతి ఇచ్చింది.

- Advertisement -

ఈ సారి ఐపూర్‌, కుచ్‌ బీహార్‌, హోలోంగి, జం షెడ్‌పర్‌, పాక్యోంగ్‌, మోపా (గోవా) కొత్త విమానాశ్రయాల నుంచి కూడా సర్వీస్‌లు
నడవనున్నాయి. జీరో, హిండన్‌ విమానాశ్రయాల నుంచి మాత్రం ఈ సమ్మర్‌ షెడ్యుల్‌లో సర్వీస్‌లకు అనుమతి లభించలేదు. వీటి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. అత్యధికంగా ఇండిగో సంస్థ 11,465 సర్వీస్‌లకు అనుమతి పొందింది. స్పైస్‌ జట్‌2,240 సర్వీస్‌లు నడపనుంది. ఎయిర్‌ ఇండియా 2,178 సర్వీస్‌లు ఎయిర్‌ ఏషియా 1,456 సర్వీస్‌లు, విస్తారా 1,856 సర్వీస్‌లు, ఇండియా ఒన్‌ 82 సర్వీస్‌లు నడిపేందుకు అనుమతి పొందాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement