Thursday, March 28, 2024

మహేష్‌బాబు ‘రాజకుమారుడు’ మూవీకి 22 ఏళ్లు

ప్రిన్స్ మహేష్‌బాబు హీరోగా అరంగేట్రం చేసిన తొలి చిత్రం ‘రాజకుమారుడు’ విడుదలై నేటికి 22 ఏళ్లు. 1999 జూలై 30న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ ప్రత్యేకమైన పోస్టర్ విడుదల చేసింది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమాలో మహేష్‌బాబు సరసన ప్రీతిజింటా హీరోయిన్‌గా నటించింది.

మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఆయన స్వరపరిచిన పాటలు ఈ సినిమా సక్సెస్ సాధించడంలో కీలకపాత్ర పోషించాయి. గోదారి గట్టు మీద, రామసక్కనోడమ్మ చందమామ, ఎందుకీ ప్రాయము నువ్వు లేనప్పుడు, ఇందురుడో చందురుడో మామ, బాలీవుడ్ బాలరాజుని అంటూ సాగే పాటలు ఎంతో ప్రేక్షకాదరణ పొందాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement