Thursday, April 25, 2024

నిరుద్యోగులకు కుచ్చుటోపీ.. బొట్టుబిళ్లలు, వత్తుల పేరుతో 200 కోట్ల‌ టోక‌రా

హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌: కుక్కపిల్లా, సబ్బుబిళ్ల, అగ్గిపుల్లాకాదేదీ కవితకు అనర్హం శ్రీశీ అంటే… బొట్టుబిల్లా, దీపం వత్తులు కాదేదీ మోసానికి అనర్హం అంటూ హైదరాబాద్‌ లో కోట్లాదిరూపాయల టోకరా వేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ లో బొట్టు బిళ్లలు, దీపం వత్తుల తయారీ పేరుతో ఓ వ్యక్తి రూ.200కోట్ల భారీ మోసానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌ ఏఎస్‌ రావునగర్‌ లో రమేష్‌ అనేవ్యక్తి ఆర్‌.ఆర్‌ ఎంటర్‌ప్రైజ్‌ పేరుతో ఓ కంపెనీని స్థాపించి దీపం వత్తులు, బొట్టుబిల్లల తయారీ యంత్రాలను విక్రయించాడు. దీపంవత్తుల యంత్రానికి రూ. 1.70 లక్షలు, బొట్టుబిళ్లల తయారీ యంత్రానికి రూ.1.40 లక్షల చొప్పున వినియోగదారులకు విక్రయించాడు. స్వయం ఉపాధి కోసం అనేక మంది ఈ యంత్రాలను కోని మోసపోయారు.

తాను ఇచ్చే ముడిసరుకుతో ఉత్పత్తులు తీసుకువస్తే కిలోల కొద్ది కొని డబ్బులు చెల్లిస్తానని నమ్మపలికాడు. యంత్రాలు కొని మార్కెటింగ్‌ చేయడంకూడా సులువుగా ఉండటంతో అనేకమంది నిరుద్యోగులు, స్వయం ఉపాధికోరుకునే వారు ఈ యంత్రాలను ఎగబడి కొనుగోలు చేశారు. అయితే యంత్రాల కొనుగోలు దారులతో రమేశ్‌ ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకు కిలో బొట్టు బిళ్లలకు రూ.600, వత్తులకు రూ.300 చెల్లించాలి. మరికొంతమంది యూట్యూబ్‌ లోచూసి రమేష్‌ దగ్గర యంత్రాలను కొనుగోళు చేశారు. ఈ వ్యవహారంలో 1100 మంది మోసపోయారు. యంత్రాలను కొనుగోలు చేసిన వారికి ముడిసరుకు ఇవ్వడంకానీ, ఉత్పత్తులను కొనడం చేయలేదు. అయితే కొనుగోలు దారులు కంపెనీకి వెళ్లగా బోర్డు తిప్పేశారు. అడ్రసు కూడా గళ్లంత‌య్యింది. ఇక తాము చేసేది ఏమీలేదనీ, మోసపోయమని గ్రహించి యంత్రాలు కొనుగోలు చోసినవారు కుషాయిగూడా పోలీసుస్టేషన్‌ లో ఫిర్యాదుచేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. పోలీసులు ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement