Friday, April 19, 2024

ద‌స‌రా సినిమా నిడివి ఎంతంటే….

నేచురల్‌ స్టార్‌నాని నటిస్తు న్న ‘దసరా’ మార్చి 30న విడు దలకు సిద్ధమవుతోంది. శ్రీకాంత్‌ ఒదెల దర్శకుడు. ఈ చిత్రం సెన్సార్‌ కూడా పూర్తి చేసుకుంది. సినిమా రన్‌ -టైమ్‌ 2:36 గంటలుగా లాక్‌ చేశారు. ఇలాంటి జానర్‌ సినిమాలకు ఇది పర్ఫెక్ట్‌ రన్‌-టైమ్‌. టీ-జర్‌, -టైలర్‌లో చూసి నట్లు-గా కథకు మంచి అవకాశం ఉంది. ఇందులో పల్లెటూరి స్నేహితుల మధ్య అందమైన బాండింగ్‌, రస్టిక్‌ లవ్‌ స్టొరీ, మునుపెన్నడూ లేని విధంగా యాక్షన్‌, అంద రినీ కదిలించే భా వోద్వేగాలు ఇందులో వున్నాయి. డి-గ్లా మరస్‌గా కనిపించే పాత్ర పోషించారు నాని. పరిస్థి తులకు అనుగుణంగా భిన్నంగా ప్రవర్తించే అనూహ్య పాత్రలో కనిపి స్తారు. అలాగే వెన్నెలగా కీర్తి సురేష్‌ పాత్ర దసరా లో చాలా ఆసక్తిగా ఉండబోతుంది. దీక్షిత్‌ శెట్టి నాని స్నేహితుడిగా కని పించనున్నారు. సముద్రఖని పాత్ర కూడా కీలకంగా ఉండ బోతోంది. సంతోష్‌ నారాయణన్‌ తన మ్యూజిక్‌ మాయాజా లంతో సన్నివేశాలను మరో స్థాయికి ఎలివేట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement