Sunday, April 11, 2021

తెలంగాణలో కోరలు చాస్తున్న కరోనా.. 2 వేలకు చేరువ..!

తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. సెకండ్ వేవ్‌తో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతున్నాయి. రోజు వారీ కేసులు 2 వేలకు చేరువలో ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్త‌గా 1,914 కరోనా కేసులు నమోదయ్యాయి. 74,274 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,914 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క‌రోజులో కరోనాతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 393 కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,16,649 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,03,298 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,734కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారి నుంచి 285 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 11,617 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 6,634 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Prabha News