Wednesday, April 24, 2024

ఈ నెల 27నుండి.. ఆహాలో 18పేజెస్

ఆహాలో స్ట్రీమింగ్ కానుంది 18పేజెస్ మూవీ. ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం 18పేజెస్. ఈ చిత్రంలో నిఖిల్ ..అనుప‌మ జంట‌గా న‌టించారు. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌ టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ ప్రీమియర్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్‌. పాపులర్‌ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది .ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ 2-సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్లపై బన్నీవాసు నిర్మించారు. 18 పేజెస్‌కు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథనందించారు. ‘ సుకుమార్‌ రైటింగ్స్ అంటేనే ఓ మ్యాజిక్‌.. ఆ కలం నుంచి వచ్చిన ఒక థ్రిల్లింగ్‌, టచింగ్ బ్లాక్ బస్టర్ 18 పేజెస్‌.. చదవడానికి అందుబాటులో.. సారీ జనవరి 27 నుంచి వీక్షించండి’ అంటూ ఆహా టీం స్పెషల్ వీడియోను షేర్ చేసింది.డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ చిత్రం.

Advertisement

తాజా వార్తలు

Advertisement