Friday, April 19, 2024

18పేజెస్ లో శింబు పాట‌ని ఎలా పాడారో .. వీడియో రిలీజ్ చేసిన మేక‌ర్స్

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ‌..అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తోన్న చిత్రం 18పేజెస్. ఈ చిత్రంలో త‌మిళ స్టార్ హీరో శింబు పాట పాడారు. ప‌ల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో టైం ఇవ్వు పిల్లా పాటను శింబు పాడిన విషయం తెలిసిందే. ఈ సాంగ్‌ను డిసెంబర్ 5న లాంఛ్ చేయబోతున్నట్టు మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ ద్వారా ఇప్పటికే తెలియజేశారు. కాగా సాంగ్‌ ఎలా పాడాడో తెలియజేస్తూ.. విడుదలైన వీడియో ఇపుడు అందరి అటెన్షన్‌ను తమవైపునకు తిప్పుకుంటోంది. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌ టైన‌ర్‌గా వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన నన్నయ రాసిన పాటకు మంచి స్పందన వస్తోంది. గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.డిసెంబర్‌ 23న గ్రాండ్‌గా థియటర్లలో విడుదల కానుంది 18 పేజెస్‌ . ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ 2-సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్లపై బన్నీవాసు నిర్మిస్తున్నారు. 18 పేజెస్‌కు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథనందిస్తుండటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement