Thursday, March 28, 2024

తెలంగాణలో కొత్తగా 1362 కరోనా కేసులు…10మంది మృతి

తెలంగాణలో కరోనా కేసులు మరింత తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24గంట‌ల్లో మొత్తం 1,23,005 మందికి ప‌రీక్ష‌లు చేయ‌గా 1362మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే గడిచిన 24 గంటల్లో 1813మంది క‌రోనా నుంచి కొలుకున్నారు. అలాగే కరోనా తో 10మంది చికిత్స పొందుతూ మృతి చెందారు.

తాజా గణాంకాల ప్రకారం తెలంగాణ‌లో మొత్తం కేసుల సంఖ్య 6,12,196కి చేరింది. అలాగే డిశ్చార్జ్ కేసుల సంఖ్య 5,90,072కి చేరింది. అలాగే మొత్తం 3,556మంది మృతి చెందారు. ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 18,568 యాక్టీవ్ కేసులు ఉన్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement