Friday, April 26, 2024

Telangana | 133 కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్ట్ .. 27న శంకుస్థాప‌న చేయ‌నున్న మంత్రి కేటీఆర్‌

వరంగల్ / హనుమకొండ, (ప్ర‌భ న్యూస్‌): మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ నెల 27 న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లోని వేలేరు మండలానికి వెళ్ల‌నున్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని చిల్పూరు, వేలేరు, ధర్మసాగర్ మండలాల్లోని కరువు పీడిత గ్రామాలకు సాగునీరు అందించడానికి ప్ర‌భుత్వం రూ.133 కోట్ల అంచనా వ్యయంతో ఇరిగేషన్ ప్రాజెక్టు చేప‌డుతోంది. దీనికి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ పర్యటన విజయవంతం కోసం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ – హనుమకొండ లోని తన క్యాంప్ ఆఫీసులో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. తీవ్ర కరువుతో కొట్టు మిట్టాడుతున్న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ, ప్రత్యేకించి వేలేరు, చిల్పూరు, ధర్మసాగర్ మండలాల రైతులకు సాగు నీరు అందించే ప్రాజెక్టు కు సీఎం కెసిఆర్ భగీరథ ప్రయత్నం, మంత్రి ktr చొరవతో నిధులు మంజూరు అయ్యాయ‌న్నారు. దానికి శంకుస్థాపన చేయడానికి కేటీఆర్ రావడం హర్షించదగ్గ విషయం అన్నారు.

- Advertisement -

మంత్రి ktr రాక సందర్భంగా ఆ పర్యటన విజయవంతం కోసం పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేయాలన్నారు. కేటీఆర్ పర్యటనలో భాగంగా, శంకుస్థాపన ప్రదేశం , బహిరంగ సభ నిర్వహణ దాని కోసం జన సమీకరణ తదితర అంశాలపై మంత్రి వారితో చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, zp చైర్మన్లు సంపత్ రెడ్డి, సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement