Wednesday, March 27, 2024

తెలంగాణలో కొత్తగా 1197కరోనా కేసులు

తెలంగాణలో మరింతగా కరోనా కేసులు తగ్గాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1197 కరోనా పాజిటివ్ కేసుయో నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 6,14,399 కి చేరింది. అలాగే మొత్తం 5,93,577 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 17,246 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా ఈ మహమ్మారి కారణంగా 9 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 3,576 కి చేరింది. అలాగే గడిచిన 24 గంటల్లో 965 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement