Thursday, August 5, 2021

తెలంగాణ లో కొత్తగా 1114 కరోనా కేసులు

తెలంగాణ లో కరోనా కేసులు క్రమేణా తగ్గుతున్నాయి. కొత్తగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,114 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే మరో 12 మంది కరోనా తో మృతి చెందారు. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,16,688కి చేరింది. అలాగే 3,598మంది కరోనా కారణంగా చనిపోయారు. కొత్తగా 1,280 మంది మహమ్మారి నుంచి కోలుకోగా, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,96,628కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,462 యాక్టివ్ కేసులున్నాయి.

అలాగే గడిచిన 24 గంటల్లో GHMC లో 129 కరోనా
కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,32,807 కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News