Thursday, April 25, 2024

తెలంగాణలో 24 గంటల్లో 1079 కరోనా కేసులు….స్పీడ్ తగ్గలే !!

తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమేణా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 43070 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో ఆరుగురు చికిత్సపొందుతూ మృతి చెందారు. మరోవైపు 268 మంది గడచిన 24 గంటల్లో ఈ మహమ్మారి నుండి కోలుకున్నారు. ఇక తాజా కేసులు తో కలిపి రాష్ట్రం మొత్తం ఇప్పటివరకూ 3,13,237 కరోనా కేసులు నమోదయ్యాయి.అలాగే 8746 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 3,02,768 మంది డిశ్చార్జ్ అయ్యారు.

మరోవైపు ఇప్పటివరకు 1723 మంది ఈ మహమ్మారి కారణంగా మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులలో ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. గ్రేటర్లో 302 కేసులు రాగా మేడ్చల్ లో 138 రంగారెడ్డిలో 116 కేసులు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement