Friday, April 19, 2024

స్విగ్గీలో 10 శాతం ఉద్యోగాల కోత

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ 8 నుంచి 10 శాతం ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం కంపెనీలో 6వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రొడక్ట్‌, ఇంజినీరింగ్‌, ఆపరేషన్‌ డిపార్ట్‌మెంట్స్‌లో ఉద్యోగాల కోత ఉండే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీఓకు ముందు కంపెనీ లాభాల్లోకి తీసుకురావడంతో భాగంగా కంపెనీ ఈ చర్యలు చేపట్టనుందని తెలిపింది. ఉద్యోగాల తొలగింపులో భాగంగా 2022 అక్టోబర్‌లో ఉద్యోగుల పనితీరుపై స్విగ్గీ సమీక్ష నిర్వహించింది. ఇప్పటికే కొంత మంది ఉద్యోగులకు రేటింగ్‌ ఇచ్చి, తమ పనితీరును మెరుపరుచుకోవాలని కోరింది. మరో వైపు కొన్ని నెలలుగా ఉద్యోగులపై తీవ్ర పని ఒత్తిడి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

- Advertisement -

ఐపీఓకు ముందు కంపెనీని లాభాల్లోకి తీసుకు వచ్చేందుకు ఉద్యోగులకు కంపెనీ లక్ష్యాలు నిర్ధేశించింది. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు నెలకొన్నందున దేశీయ స్టార్టప్‌ కంపెనీలకు ఫండింగ్‌ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునేందుకు స్విగ్గీ ఆలోచన చేస్తోంది. టెక్‌ స్టాక్స్‌ ఆశించిన స్థాయిలో రాణించక పోవడంతో ఐపీఓ విషయంలోనూ వేచి చూసే ధోరణిలోలో స్విగ్గీ ఉంది. స్విగ్గీ నష్టాలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. 2021లో 1,617 కోట్లుగా ఉన్న నష్టాలు, 2022 ఆర్ధిక సంవత్సరంలో 3,628.90 కోట్లకు చేరాయి. స్విగ్గీతన మార్కెట్‌ వాటాను కూడా క్రమంగా కోల్పోతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement