Saturday, April 13, 2024

హైదరాబాద్‌లో మహిళా జర్నలిస్టులకు 10 రోజుల ఉచిత వైద్య శిబిరం..

హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ వద్ద ఉన్న రాష్ట్ర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో(state’s Department of Relations Headquarters) మహిళా జర్నలిస్టుల కోసం ఉచిత వైద్య, ఆరోగ్య శిబిరాన్ని పది రోజుల పాటు (మార్చి 29- ఏప్రిల్ 7) నిర్వహించనున్నారు. ఈ శిబిరం రేపు (బుధవారం) ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతి రోజు వరుసగా 10 రోజుల పాటు ఉంటుంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అవార్డు కార్యక్రమంలో మహిళా జర్నలిస్టులు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటి రామారావును కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

వైద్య శిబిరంలో రక్త పరీక్షలు (CBP), బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ B12, D3తో పాటు ECG, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మెర్, స్క్రీనింగ్ పరీక్షలు, కంటి పరీక్షలు, స్క్రీనింగ్, దంత పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు కూడా నిర్వహించనున్నరు.

- Advertisement -

రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన జర్నలిస్టులుగా పనిచేస్తున్న మహిళలందరూ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధకారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement