Wednesday, March 27, 2024

ప్ర‌భాస్ మూవీ కోసం రూ..10కోట్ల‌తో.. పాత థియేట‌ర్ సెట్టింగ్ వేయించిన మారుతీ

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్..ద‌ర్శ‌కుడు మారుతీతో ఓ సినిమాని చేయ‌నున్నాడు. కాగా ప్రభాస్ సినిమా కోసం మారుతి ఒక అరుదైన ఎపిక్ సెట్టింగ్ ను వేయించాడట. హైదరాబాద్ శివారు ప్రాంతంలో దాదాపు 10 కోట్ల రూపాయలను ఖర్చు చేసి పాత థియేటర్ సెట్టింగ్ ను నిర్మించారట. 1970 కాలం నాటి వాడుకలో లేని థియేటర్ కు సంబంధించి ఈ సినిమాలో ప్రధానంగా సన్నివేశాలు ఉంటాయట. ఆ థియేటర్ పేరు రాజా డీలక్స్.

వాడుకలో లేని థియేటర్ కనుక అందులో దెయ్యాలు.. బూతాలు ఉండవచ్చు. ఈ సినిమా హ్రరర్ కామెడీ అంటూ ఇప్పటికే యూనిట్ సభ్యుల ద్వారా లీక్ వచ్చింది. కనుక ప్రభాస్ ఆ థియేటర్ తో ఉన్న అనుబంధంను ఈ సినిమాలో ప్రధానంగా చూపించే అవకాశాలు ఉన్నాయి. సినిమాలోని మెజార్టీ సన్నివేశాలు .. కీలకమైన హర్రర్ సీన్స్ ను థియేటర్ లో చిత్రీకరించబోతున్నారట. కనుకే కాస్త ఎక్కువ ఖర్చు చేసి మరీ ఈ సినిమా కోసం ఆ సెట్ ను నిర్మించారు అంటూ వార్తలు వస్తున్నాయి. తదుపరి షెడ్యూల్ ఆ సెట్ లోనే ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement