Wednesday, April 24, 2024

హ్యాపీ బర్త్ డే కేసీఆర్- హైదరాబాద్ : ఆరు దశాబ్దాల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన లెజెండ్

అరవైఏండ్ల జాతి ఆకాంక్షను నెరవేర్చి.. తెలంగాణ ప్రాంత దాస్య శృంఖలాలు తెంచి  ఇక్కడి ప్రజలు కోరుకున్న నిజమైన స్వాతంత్య్రాన్ని సాధించిన మహోన్నత శిఖరం కల్వకుంట్ల చంద్రశేఖరరావు.  జనం గుండెతడి తెలిసిన మానవతా పతాకం. తెలంగాణ శాశ్వత శాపాలను పొలిమేరలు దాటించి తరుముతున్న తేజో దీపం. ప్రజానాడి తెలిసిన అసామాన్య నాయకత్వం. రెండుదశాబ్దాలుగా తెలంగాణ ప్రాంత రాజకీయాలను తన చుట్టూ తిప్పుకుంటూ.. శాసిస్తున్న ధీశాలి. తెలంగాణ ప్రగతి వెలుగు. శతృవునైనా మాటల మంత్ర దండతో ముగ్దుల్ని చేసి చప్పట్లు కొట్టించగల చాతుర్యం.. అనుకున్నది సాధించే క్రమంలో ఎలాంటి పదవినైనా ఎడమచేత్తో విసిరికొట్టి కార్యక్షేత్రంలోకి దూకే తత్వం.. సంక్షోభాలు చుట్టుముట్టిన ప్రతిసారీ మెరుపులాంటి ఎత్తుగడలతో పరిస్థితులను ఎదుర్కొనే చాణక్యం కేసీఆర్‌ సొంతం. ఎవరూ సాధ్యం కాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి.. బంగారు తెలంగాన దిశగా ప్రజల కలలను సాకారం చేస్తూ నెంబర్‌వన్‌ సీఎంగా దేశవ్యాప్త ప్రశంసలు అందుకుంటున్న కేసీఆర్ సాహసానికి నిలువెత్తు రూపం. ఆశ్చర్యపరిచే లక్ష్యాలు ప్రకటించి.. అద్భుత వ్యూహరచనతో వాటిని సాధిస్తున్న కేసీఆర్‌ తెలంగాణ జాతిపిత. అహింసా మార్గంలో మలిదశ ఉద్యమాన్ని దూకుడుగా తీసుకువెళ్లి.. దేశమంతా కాలికి బలపం కట్టుకుని తిరిగి.. కుట్రలను చేదించి.. అరవైఏండ్ల తెలంగాణ తండ్లాట తీర్చిన మహాత్ముడు.. దార్శనికుడు. ఈ సృష్టిలో తెలంగాణ ఉన్నంతకాలం.. ప్రజల గుండెల్లో ఆయన శాశ్వతం.

Advertisement

తాజా వార్తలు

Advertisement