Friday, April 19, 2024

హైదరాబాద్ : ప్రకృతి సంతోష్

ఆయన మనసంతా భావితరాల భవిష్యత్తు కోసం పరితపిస్తుంది. తాగేనీరు బాటిళ్ళరూపంలో కొనాల్సి వస్తుందని పాతికేళ్ల క్రితం ఊహించామా.. గాలిని కూడా అలా కొనే పరిస్థితి రావొద్దని, స్వచ్చ ప్రకృతి కోసం.. భావితరాలకోసం అనుక్షణం పరి తపిస్తున్నాడు. ప్రకృతి సంతోషం కోసం యజ్ఞం చేస్తున్నాడు. పెదనాన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. హరితహారం స్ఫూర్తిని పుణికిపుచ్చుకుని.. కోట్ల మొక్కలతో వృక్షార్చన చేస్తున్నాడు. గ్రీన్‌ ఛాలెంజ్‌ లతో.. దీక్షగా పుడమి ఆహ్లాదానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ నింపిన స్ఫూర్తి.. చేస్తున్న వృక్షా ర్చన వేలాదిమంది ఆకుపచ్చ సైన్యాన్ని తయారు చేయగా, సెలబ్రిటీలు, ప్రముఖులు సంతోష్‌ నిబద్దతకు మెచ్చి కోట్లమొక్కలు నాటేయజ్ఞంలో తమ వంతు తోడ్పాటు నందిస్తున్నారు. రాజకీయ కుటుంబా ల్లోని వారు, పదవుల్లో ఉన్న వారు రాజకీయాల గురించో.. ఉన్నత పదవుల గురించో, వ్యాపారా భివృద్ది గురించో ఆలొ చిస్తారు. కానీ.. సంతోష్‌ మాత్రం ప్రకృతి గురించి ఆలోచించారు. భావితరాల భవిష్యత్తు గురించి ఆలో చించారు. పెదనాన్న తపనలోంచి ఆకుపచ్చ సంకల్పా న్ని ఒడిసిపట్టి.. ప్రకృతి సేవలోనే తరిస్తున్నాడు. అందుకే సంతోష్‌ విభిన్నం.. ఆదర్శమంటున్నారు ఈ తరం యువత. సంతోష్‌ నింపిన స్ఫూర్తి, దీక్షగా కొనసా గిస్తున్న గ్రీన్‌ ఛాలెంజ్‌, ప్రతీ పండుగ సందర్భంలో ప్రకృతికి ఇబ్బంది కలగకుండా తీసుకొస్తున్న గ్రీన్‌ కాన్సెప్ట్‌లు వేలాది మంది యువత గ్రీన్‌ వారియర్స్‌గా మారేందుకు, గ్రీన్‌ క్లబ్‌ల ఏర్పాటుకు దోహదం చేసింది. నీటి సద్వినియోగం, మొక్కల పెంపకం సామాజిక బాధ్యతగా గుర్తించే ప్రక్రియ ఉద్యమంలా సాగుతోంది. పల్లెల్లో, పట్టణాల్లో.. అనేక స్ఫూర్తిదాయక కార్య క్రమాలు జరుగుతున్నాయి.
చెక్‌డ్యామ్‌లు.. అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌లు..
సంతోష్‌ స్ఫూర్తిగా అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌ కాన్సెప్ట్‌ తెలంగాణలో విస్తరించగా, సామాజిక బాధ్యతగా అనేక మంది మొక్కల సంరక్షణ, జలసంరక్షణ కార్య క్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. నీటినిల్వ కోసం చెక్‌డ్యాంలు.. వాన నీటిని ఒడిసి పట్టుకునేందుకు అర్బన్‌ ఫారెస్ట్రీ ప్రాంతంలో ప్రత్యేకంగా చెక్‌డ్యాంలను నిర్మిస్తున్నారు. చెక్‌ డ్యాంల వల్ల నీటి లభ్యతతోపాటు మొక్కలకు నీటిని అందించడానికి ఉపయుక్తంగా ఉంటోంది. మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా కీసర ఫారెస్ట్‌నే దత్తత తీసుకుని, రూపురేఖలు మార్చిన సంతోష్‌.. గ్రీన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తం గా ఉద్యమంలా తీసుకెళ్ళారు. ఢిల్లిd దాకా ఈ స్ఫూర్తి పాకింది. బాహుబలి ప్రభాస్‌ ను సైతం రంగంలోకి దించి మరో అర్బన్‌ ఫారెస్ట్‌ను దత్తత తీసుకుని అభి వృద్ధికి అంకురార్పణ చేశారు. ప్రతిరోజూ.. ప్రకృతి పచ్చగా ధగధగ లాడేందుకు వినూత్న పద్ద తుల్లో ప్రయత్నిస్తున్నాడు. ప్రభావిత సెలబ్రిటీల ద్వారా.. సమాజంలో ఆకు పచ్చ చైత న్యం తీసుకొస్తు న్నాడు. లోక్‌ సభ స్పీకర్‌ నుండి.. కేంద్రమంత్రుల దాకా, టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ అన్ని పరిశ్రమలు సంతోష్‌ పరిశ్రమకు, ఆకుపచ్చ సంకల్పానికి జైకొట్టి.. మొక్కలు నాటే యజ్ఞంలో భాగస్వాములవుతున్నాయి.
పచ్చికబయళ్ళు.. పూలమొక్కలు
ఇరువైపులా పచ్చికబయళ్లు.. రంగురంగుల పూల మొక్కలు.. సుందరమయంగా కనిపించే వాతావ రణం మధ్య ప్రయాణిస్తే కలిగే అనుభూతే వేరు. ప్రయాణికులకు వా#హనదారులకు ఆహ్లాదం పంచేలా #హదరాబాద్‌ వరంగల్‌ జాతీయ ర#హదారికి సొబగు లు దిద్దుతున్నది ##హచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ట్రీ విభా గం. రూ.4కోట్లతో చేపట్టిన సుందరీకరణ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. #హదరాబాద్‌ మెట్రోపా లిటన్‌ అర్బన్‌ ఫారెస్ట్రీ విభాగం ప్రధాన ర#హదారులను పచ్చిక బయళ్లు, పూల మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దుతున్నది. ప్రభుత్వ యంత్రాంగం కూడా దీని ప్రాధాన్యతను గుర్తించి.. సీఎం కేసీఆర్‌ హరితహారం స్ఫూర్తిని, గ్రీన్‌ ఛాలెంజ్‌లను ముం దుకు తీసుకుపోతు న్నది.
సీఎం కేసీఆర్‌ చర్యలు.. ఆ అడుగుల్లో అడుగేసి సంతోష్‌ ఉద్య మంలా నిర్వహిం చిన గ్రీన్‌ ఛాలెంజ్‌ తో తెలంగాణ గ్రీన్‌ కవర్‌ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈనెల 17న తెలంగాణ ప్రజల ఆరాధ్యనేత, కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న కోటి వృక్షా ర్చన కార్యక్రమానికి పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమానికి గ్రామస్థాయి వరకు అనూహ్యస్పందన లభిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement