Wednesday, April 24, 2024

స్పెష‌ల్ సాంగ్‌లో అమీర్ ఖాన్ సందడి

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ త‌న అభిమానుల‌కు స‌ర్‌ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. కోయి జానే నా చిత్ర యూనిట్
ఆమీర్‌ నటించిన స్పెషల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్‌ ఆన్‌లైన్ లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అమీర్‌ఖాన్ స్నేహితుడు అమీన్ హ‌జీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అమీన్‌హ‌జీకి ఇది తొలి సినిమా కావ‌డంతో అమీర్‌ఖాన్ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తున్నాడు. చాలా కాలం త‌ర్వాత అమీర్‌ఖాన్ త‌న‌లోని డ్యాన్సింగ్ స్టైల్ తో అదర‌గొడుతున్నాడు. ఎల్లీ-అమీర్ ఖాన్ మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ డ్యాన్స్ ను థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేయ‌డం ఖాయ‌మ‌ని వీడియో సాంగ్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. అమీన్ హ‌జీ, అమీర్ గ‌తంలో ల‌‌గాన్ మంగ‌ళ్ పాండే..ది రైజింగ్ చిత్రాల‌కు క‌లిసి ప‌నిచేశారు.

https://youtube.com/watch?v=QjGCgubSo7w

Advertisement

తాజా వార్తలు

Advertisement