Monday, March 25, 2024

సంక్షేమ ప‌థ‌కాల‌కు జ‌గ‌న్ క్యాబినేట్ ఆమోదం…

అమ‌రావ‌తి – ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్‌ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. కేబినెట్‌ భేటీలో బడ్జెట్‌ సమావేశాలు, పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఉగాదికి అందించే సంక్షేమ పథకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. అజెండాలోని అన్ని అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వైయస్‌ఆర్‌ లా నేస్తం, వైయస్‌ఆర్‌ ఆసరా, ఈబీసీ నేస్తం, వైయస్‌ఆర్‌ కల్యాణమస్తు పథకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద కొత్తగా ఎనర్జీ పార్కు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొదటి విడతలో రూ.55 వేల కోట్లు, రెండో విడతలో రూ.55వేల కోట్లు పెట్టుబడి తో ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. మొత్తంగా రూ.1,10,000 కోట్ల పెట్టుబడి తో ఎన్టీపిసి ప్రాజెక్టు కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఫేజ్ వన్‌లో 30 వేల మందికి, ఫేజ్‌ టూ లో 31వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. మొత్తంగా 61వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విండ్ మరియు సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లకు కెబినెట్ ఆమోదం తెలిపింది. 1000 మెగావాట్ల విండ్, 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేయనుంది ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌. నాలుగు విడతల్లో మొత్తంగా రూ.10,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇందులో 2000 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనకు మంత్రిమండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అదే విధంగా స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డ్‌ ప్రతిపాదనలకు మంత్రిమండ‌లి ఆమోద‌ముద్ర వేసింది. జెఎస్ డ‌బ్య్లు సంస్థకు మారిటెమ్ ద్వారా 250 ఏక‌రాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. క్యాబినెట్‌ సమావేశం అనంతరం ఇటీవల మరణించిన తెలుగు సినీ ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, ఎం. బాలయ్య, కే.విశ్వనాథ్, వాణి జయరామ్, జమున, డైరెక్టర్‌ సాగర్‌కు రాష్ట్ర మంత్రివర్గం నివాళి అర్పిస్తూ మౌనం పాటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement