Thursday, April 18, 2024

‘శ్యామ్ సింగరాయ్’ నుంచి సాయిపల్లవి పవర్‌ఫుల్ లుక్

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ నుంచి సాయిపల్లవి లుక్ విడుదలైంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ లుక్‌ను విడుదల చేసింది. ‘ట్యాక్సీవాలా’ ఫేం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతిశెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

తాజాగా విడుదల చేసిన సాయిపల్లవి లుక్ ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. కాళికా దేవి అవతారంలో ఉగ్రరూపం దాల్చినట్లు కనిపిస్తోంది. కోల్‌క‌తా బ్యాక్‌డ్రాప్‌లో శ్యామ్ సింగ‌రాయ్ చిత్రం తెర‌కెక్కుతోంది. కాగా ఇప్పటికే సాయిపల్లవి ‘విరాట పర్వం’, ‘లవ్ స్టోరీ’ సినిమాలతో టాలీవుడ్‌లో యమ బిజీగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement