Saturday, March 23, 2024

శాకుంత‌లం అలా పుట్టుకువ‌చ్చింది.. గుణ‌శేఖ‌ర్

తాను మూడు సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డి హిర‌ణ్య‌ క‌శిప స్క్రిప్ట్ ని రెడీ చేసుకున్నాన‌ని తెలిపారు ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్. కోవిడ్ తరువాత అంత పెద్ద ప్రాజెక్టును పట్టాలెక్కించలేమని భావించి, ఒక లవ్ స్టోరీ చేయాలని భావించాను. ఆ సమయంలోనే శకుంతల దుష్యంతుల ప్రేమకథ నా కంట్లో పడింది. దాంతో ఈ కథనే సినిమాగా తీయాలనిఅనుకున్నాన‌న్నారు.ఈ కథ ఎవరికీ తెలియదు అనుకునే తీశాను. శకుంతల పుట్టుకతో మొదలై .. ఆమె తనయుడు భరతుడి పట్టాభిషేకంతో ఈ కథ ముగుస్తుంది.

ఈ కథలోని ఎమోషన్స్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. కాళిదాసు వర్ణనలు దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాను విజువల్ పోయెట్రీ మాదిరిగా తీర్చిదిద్దాను” అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శక నిర్మాతగా ‘శాకుంతలం’ సినిమా రూపొందింది. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. సమంత ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement