Friday, April 26, 2024

వకీల్‌ సాబ్‌ నుంచి కొత్త పోస్టర్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా వకీల్‌సాబ్ నుంచి సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.. ఇవాళ ఉమెన్స్‌ డే సందర్భంగా టీం పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు నివేథా థామస్, అంజలి, అనన్య నాగేళ్ల‌ ఉన్నారు. ఈ ఫస్ట్‌లుక్‌లో పవన్ కుర్చీలో కూర్చుని చేతిలో బేస్ బాల్ బ్యాట్‌ పట్టుకొని సీరియస్ లుక్స్‌‌తో ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల సమస్య ఇతివృత్తంతో హిందీలో రూపొందిన పింక్‌కు తెలుగు రీమేక్‌గా వకీల్ సాబ్ తెరకెక్కింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రముఖ కథానాయిక శ్రుతీహాసన్ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంది. తమన్ సంగీతం అందించిన రెండు పాటలు ఇప్పటికే విడుదలై శ్రోతలను మెప్పించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement