Thursday, March 28, 2024

రాజ‌ధాని బిల్లుల ఉప‌సంహ‌ర‌ణ కేసు విచార‌ణ డిసెంబ‌ర్ 27కు వాయిదా

త్రిసభ్య ధర్మాసనం ఎదుట ఏపీ రాజధాని బిల్లుల ఉపసంహరణ కేసు విచారణ జరిగింది. పిటిషనర్ల తరపున న్యాయవాదులు శ్యామ్‍దివాన్, సురేష్ వాద‌న‌లు వినిపించారు. ఉపసంహరణ బిల్లుల్లో కూడా ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను తీసుకువస్తామని చెప్పింది. ఏపీకి అమరావతి మాత్రమే రాజధాని.. మాస్టర్ ప్లాన్ కూడా అదే చెబుతుందన్న పిటిషనర్ తరపు లాయర్లు తెలిపారు.

అందువల్ల ఈ పిటిషన్లపై విచారణ కొనసాగించాలని లాయర్లు వాదించారు. బిల్లులపై గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు.. గవర్నర్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత రాజధాని పిటిషన్లపై విచారణ కొనసాగింపునకు ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. చట్టానికి లోబడి అభివృద్ధి చేసేందుకు ప్రతిబంధకంగా ఉన్న మధ్యంతర ఉత్తర్వులను తొలగిస్తున్నామని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వ శాఖల తరలింపుపై ఉన్న స్టేటస్‍కో ఉత్తర్వులు కొనసాగించాల‌ని తెలిపింది. తదుపరి విచారణ ను హైకోర్టు డిసెంబర్ 27కు వాయిదా వేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement