Saturday, April 20, 2024

యాక్టివ్ గా ఉండెందుకు చెంప దెబ్బ కొట్టించుకున్న జూడో స్టార్..

ఎవరైన మ్యాచ్ ఆడేముందు వామప్ చేస్తారు లేదా ప్రశాంతంగా ఉండి బరిలో దిగుతారు..కాని ఒలింపిక్స్ బరిలో దిగేముందు జర్మనీకి చెందిన ఓ క్రీడాకారిని చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు. జూడో స్టార్ మార్టినా ట్రాడోస్ తన కోచ్ తో మ్యాచ్ కు ముందు చెంప దెబ్బలు కొట్టించుకుంది. దీంతో అవాక్కవడం ప్రేక్షకుల వంతయింది. జూడో స్టార్ మార్టినా ట్రాడోస్ కోచ్‌తో క‌లిసి వ‌స్తోంది. ఆమె రింగ్‌లోకి వెళ్లే ముందు త‌న వెంటే ఉన్న కోచ్ రెండు చేతుల‌తో కాల‌ర్ ప‌ట్టుకొని లాటి రెండు చెంప‌ల‌పై వాయించాడు. ఇది చూసిన వాళ్లంతా షాక్ తిన్నారు. కెమెరాల ముందే ఈ కోచ్ ఏంటి ఇలా చేస్తున్నాడ‌ని అంతా ముక్కున వేలేసుకున్నారు. అయితే ఆ చెంప‌దెబ్బ‌లు తిన్న మార్టినా మాత్రం ఇది కామ‌నే అని చెప్ప‌డం విశేషం. ఫైట్‌కు ముందు కోచ్ ఇలా చేయ‌డం ఆన‌వాయితీ అని ఆమె చెప్ప‌డం మ‌రింత షాక్‌కు గురి చేసింది. అది కూడా తాను చెప్ప‌డం వ‌ల్లే కోచ్ అలా చేస్తున్నాడ‌ని మార్టినా చెప్పింది. ఫైట్‌కు ముందు తాను యాక్టివ్‌గా ఉండ‌టానికి ఇది త‌న‌కు అవ‌స‌రం అని ఆమె అన‌డం విశేషం. అయితే ఈ వీడియో చూసిన సోష‌ల్ మీడియా యూజ‌ర్లు కోచ్‌పై మండిప‌డుతున్నారు.

ఇది కూడా చదవండి : సౌర విద్యుత్ ఉత్ప‌త్తిలో తెలంగాణ రెండో స్థానం: కేటీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement