Thursday, April 25, 2024

మ‌ళ్లీ వస్తున్నా…కరోనా కాలింగ్ – కేంద్రం హై అలెర్ట్

ఢిల్లీ – దేశంలో తిరిగి క‌రోనా కేసులు పెరుగుతున్నాయి.. వారం కింద‌టి వ‌ర‌కు ప‌దుల సంఖ్య‌లో న‌మోద‌వుతున్న కేసులు తాజాగా వేల సంఖ్య‌కి చేరింది.. దీంతో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. ఈ విషయమై కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు హెచ్చరికాలు జారీ చేసింది. అంతే కాకుండా కరోనా వ్యాప్తి చెంద‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని రాష్ట్రాల‌కు సూచించింది.. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాలతో కేంద్రం కేంద్రం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది. కేసుల ఉదృతిని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్‌ 10, 11వ తేదీల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు నమోదుకాగా, వైరస్‌ కారణంగా ఆరుగురు మృతి చెందారు. 146 రోజుల తర్వాత ఒకే రోజు అత్యధిక కేసులు నమోదవడం ఇదే తొలిసారి . ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఫోర్‌ ‘టీ’ (టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌-టీకా)పై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement