Thursday, March 28, 2024

సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ టీజర్‌ వచ్చేసింది

ప్రముఖ బాడ్మింటన్‌‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ సైనా. ఈ సినిమా టీజర్‌ విడుదలయింది. సైనా పాత్రలో బాలీవుడ్‌ నటీ పరిణితి చోప్రా నటిస్తోంది. టీజర్‌లో సైనా నెహ్వాల్‌ సాధించిన విజయాలను ఆద్యంతం ఆసక్తి గొలిపేటట్లు చూపించారు. మన దేశంలో 125 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందులో సగం మంది ఆడవాళ్లు ఉన్నారు. మన దేశంలో 18 ఏళ్లు నిండితే పెళ్లి చేసి అత్తారింటికి పంపేస్తారు. కానీ కొద్ది మంది మాత్రమే తమ తల్లిదండ్రులు ప్రోత్సాహంతో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. అలాంటి వారిలో సైనా ఒకరు అని ప్రారంభమవుతుంది.

ఈ సినిమా కోసం పరిణితి చోప్రా 10 కిలోల బరువు తగ్గింది. అంతేకాదు పాత్ర కోసం పరిణితి బాడ్మింటన్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. టీ సిరీస్‌ బ్యానర్‌‌పై భూషణ్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి అమోల్‌ గుప్తా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్‌ 26 న విడుదల చయనున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement