Wednesday, April 24, 2024

పెట్రోల్‌ బంక్‌లో ఆటోవాలా డ్యాన్స్‌…ఫుల్‌ టైం పాస్‌

కొంత మంది సరదాకి చేసిన పని వారిని సోషల్‌ మీడియా ఓవర్‌ నైట్‌ స్టార్లుగా మార్చేస్తుంది. మహారాష్ట్రలోని పుణకు చెందిన ఓ వ్యక్తి కూడా ఇప్పుడు అలానే ఫెమస్‌ అయ్యాడు. బాబా కాంబ్లి అనే ఆటో డ్రైవర్‌ చేసిన డ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది . సింపుల్‌ గా స్టెప్స్‌ వేస్తూ అందరిని అలరించాడు. బాబా కాంబ్లి పెట్రోల్‌ కోసం బంక్‌ కు వెళ్లాడు. అయితే ఆ సమయంలో విద్యుత్‌ లేకపోవడంతో పెట్రోల్‌ కోసం వెయిట్‌ చేయాల్సివచ్చింది. వెయిట్‌ చేసి చేసి బోరుగా ఫిలయిన కాంబ్లి డ్యాన్స్‌ చేయడం ప్రారంభించాడు. తోటి స్నేహితులు కూడా ప్రోత్సాహించడంతో కాంబ్లి డ్యాన్స్‌ ఇరగదీశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. తన డ్యాన్స్‌ చూసిన సెలబ్రిటీలు కూడా తనకు ఫోన్‌ చేసి అభినందించారని చెపుతున్నాడు కాంబ్లి.

https://youtube.com/watch?v=0hmwcBVFY-c
Advertisement

తాజా వార్తలు

Advertisement