Wednesday, April 24, 2024

పాఠశాలల నిర్వహణ రాష్ట్రాల అంశం.. ఎంపీ శ్రీకృష్ణదేవరాయల ప్రశ్నలకు కేంద్రమంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విద్య అనేది రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉన్నందున పాఠశాలల నియంత్రణ, నిర్వహణ, పర్యవేక్షణ, ఉపాధ్యాయుల సేవా నిబంధనలు, షరతులు సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒకే ఉపాధ్యాయుడు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్యను పెంచడానికి, రాష్ట్రాలకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటని వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు సోమవారం కేంద్ర విద్యా శాఖ సహాయమంత్రి అన్నపూర్ణదేవీ బదులిచ్చారు.

ఉపాధ్యాయుల వేతనాల కోసం కేంద్రం ప్రాయోజిత సమగ్ర శిక్ష పథకం ద్వారా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సాయం అందిస్తున్నట్లు చెప్పారు. పాఠశాలల అభివృద్ధికి 2020–21లో దాదాపు రూ.21,554 కోట్ల నిధులకు ఆమోదం లభించగా  వాస్తవంగా రూ.18,654 కోట్లు వినియోగించినట్లు చెప్పారు. 2021–22లో ప్రభుత్వం రూ.20,041కోట్లు నిధులను మంజూరు చేయగా అందులో రూ.14,385 కోట్లు వినియోగించారని చెప్పారు. 2013–14, 2021–22 మధ్య ప్రాథమిక విద్యాస్థాయిలో విద్యార్థి – ఉపాధ్యాయ నిష్పత్తి 31 నుండి 26కి తగ్గిందని ఆమె తెలిపారు.

ఈ చెక్కులు చెల్లుబాటు 

- Advertisement -

ఆర్‌బీఐ  నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రూమెంట్స్‌ యాక్ట్, 1881 ప్రకారం దేశంలో ఈ చెక్కులు చెల్లుబాటు అవుతాయని  లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక  మంత్రిత్వ శాఖ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. దేశంలో ఈ చెక్కుల చెల్లుబాటు, ఎలక్ట్రానిక్‌ ప్రత్యామ్నాయాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి తీసుకున్న చర్యలు, బ్యాంకులకు జారీ చేసిన ఆదేశాల గురించి ప్రశ్నించారు. ఎలక్ట్రానిక్‌ ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడానికి, చెక్కులను క్లియర్‌ చేయడానికి ఆర్‌బీఐ ‘చెక్‌ ట్రంకేషన్‌ సిస్టమ్‌’ ని ప్రవేశపెట్టిందని, ఇది దేశంలో ఎక్కడైనా పనిచేస్తుందని కేంద్రమంత్రి తెలిపారు. ఈ చెక్కుల అమలకు సంబంధించి.. దేశంలో పనిచేస్తున్న అన్ని షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు ఆర్‌బీఐ ఇచ్చిన ఆదేశాలను, సర్క్యులర్‌లను అనుసరించాల్సిందేనని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement