Friday, March 29, 2024

త్వరలో పీసీపీఐఆర్ పనులు వేగవంతం.. వైసీపీ ఎంపీలకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విశాఖపట్నం-కాకినాడ ప్రాంతాల్లో పీసీపీఐఆర్ (పెట్రోలియం, కెమికల్స్ అండ్ పెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్) ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌కు 2009లోనే పీసీపీఐఆర్ (పెట్రోలియం, కెమికల్స్ అండ్ పెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్)ను కేంద్రం మంజూరు చేసిందని తెలిపింది. లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీలు మార్గాని భరత్, డా. బీశెట్టి సత్యవతి అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా శుక్రవారం రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.

విశాఖపట్నం పీసీపీఐఆర్ మాస్టర్ ప్లాన్‌ను 2011లో చేపట్టి, 2013లో ప్రచురించారని ఆయన తెలిపారు. యాంకర్ టెనంట్స్‌(లీడ్ ప్రాజెక్ట్స్)గా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) ప్రీ-ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాయని వివరించారు. యాంకర్ యూనిట్ నెలకొల్పే ప్రాంతం, క్రాకర్ కాంప్లెక్స్ సామర్థ్యంపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాత పర్యావరణ అనుమతుల కోసం పబ్లిక్ హియరింగ్ జరుగుతుందని కేంద్రమంత్రి చెప్పారు. యాంకర్ టెనంట్ విషయం ఖరారైతే ఏపీలో పీసీపీఐఆర్ వేగవంతం అవుతుందని ఆయన వివరించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement