తౌకతే తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మియాపూర్, బాచుపల్లి, కూకట్పల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ, కిస్మత్ పూర్, శంషాబాద్, గగన్ పహాడ్, ఫలక్నుమా, చాంద్రాయణగుట్ట, ఛత్రినాక, అమీర్పేట, ఎస్.ఆర్.నగర్, యూసఫ్ గూడ, కృష్ణానగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో పలుచోట్ల రోడ్లు జలమయం అయ్యాయి. భారీ వర్షం కురిసిన సమయంలో లాక్డౌన్ అమలులో ఉండటంతో ట్రాఫిక్ ఇక్కట్లు తప్పాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement