Thursday, April 25, 2024

తెనాలిలో ఎన్టీఆర్ సినిమా ప్రదర్శనలు అభినందనీయం- నందమూరి బాలకృష్ణ

తెనాలి (ప్రభ న్యూస్) కళలకు కాణాచిగా వాసికెక్కిన ఆంధ్రా పారిస్ తెనాలిలో ఎన్టీఆర్ చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎన్టీఆర్ తనయుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. స్థానిక పెమ్మసాని థియేటర్ లో మాజీ మంత్రి తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.తొలుతఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని నినదించిన ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలకు సుపరి పాలన అందించారన్నారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్టీఆర్ సినిమాలు ఏడాదిపాటు వారానికి ఐదు రోజులు ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మళ్లీ జన్మంటూ ఉంటే తాను తెలుగువాడి గానే పుడతానని ఆకాంక్షించారు. ఓటును నోటుతో కాకుండా దాని పవిత్రత కాపాడాలని ఆయన కోరారు. ప్రస్తుత పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరారని దానిని మన్నించి రాష్ట్ర ప్రజలు ఆయనకు పట్టం కడితే, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి ప్రజలు కొనుగోలు శక్తి కోల్పోయి విలవిలలాడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని కోరుకునే తమను రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల ఆశీర్వదించాలని కోరారు. తన రాక సందర్భంగా నందివెలుగు నుండి తెనాలి వరకు ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ ని చూస్తుంటే ఎన్టీఆర్ కళ్ళ ముందే కనపడుతున్నారన్నారు. రాష్ట్రంలో దుష్టపాలన అంతమొందించి ప్రజలకు సంక్షేమాన్ని అందించే తెలుగుదేశం పార్టీకి ప్రజల మద్దతు ఇవ్వావాలని ఆయన పిలుపునిచ్చారు, కార్యక్రమంలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ,నక్కా ఆనందబాబు,బుర్ర సాయి మాధవ్, జాని భాష, ఈదర వెంకట పూర్ణచంద్, పెమ్మసాని శ్రీను, మంగమూరి హరి ప్రసాద్, గుమ్మడి ప్రసాద్, కుద్దూస్, పిన్నారావు, త్రిమూర్తి,మల్లవరపు విజయ్, బోయపాటి అరుణ, దివి అనిత, దేసు యుగంధర్, కొల్లూరు శ్రీదర్, శాఖమూరి చిన్నా , సురేంద్ర, డోగుపర్తి విజయ్, గిరి గణేష్, తాడిబోయిన హరి ప్రసాద్, కనకరాంబాబు, కుదరవల్లి శ్రీనివాసరావు,డా. పాటిబండ్ల దక్షణమూర్తి, డా. వేమూరి శేషగిరిరావు, మాదల కోటేశ్వరరావు తదితరులు పార్టీ శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement