Friday, March 29, 2024

ఢిల్లీ మ‌ర్డ‌ర్ కేసు.. ఆఫ్తాబ్‌కు రెండు వారాల జ్యుడీషియల్‌ కస్టడీ

ప్రియురాలు శ్రద్ధాను 35 ముక్కలుగా నరికిన ఆఫ్తాబ్‌కు ఢిల్లి కోర్టు 13 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. అఫ్తాబ్‌ను ఆసుపత్రి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు అఫ్తాబ్‌ను పోలీసులు తీహార్‌ జైలుకు తరలించనున్నారు. బహుశా నేడు నార్కోటిక్‌ పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ఢిల్లిలోని మెహౌలీ ప్రాంతంలో ఉన్న ఫ్లాటులో ఆఫ్తాబ్‌ మే 18న శ్రద్ధాను చంపేశాడు. ఆ మరుసటి రోజు పది గంటల పాటు శ్రమించి ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేశాడు.

ముక్కలుగా కోసేముందు శ్రద్ధా శవంపై వేడినీళ్లు పోశాడు. సులభంగా కోసేందుకు అవకాశం ఉంటుందని అలా వేడినీళ్లు పోసినట్లు పోలీసులకు తెలిపాడు. 35 ముక్కలను 18 ప్యాకుల్లో అమర్చాడు. ఒక్కో ప్యాక్‌ను ఒక్కోరోజు చొప్పున 18 రోజుల పాటు రాత్రి 2 గంటల సమయంలో మెహౌలీ అటవీ ప్రాంతంలో పడేశాడు. పోలీసులు ఇప్పటివరకూ శ్రద్ధాకు చెందిన 13 ఎముకలను మె#హౌలీ అటవీ ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్నారు. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా వీటిని ఆమెవేనని గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement