Friday, April 26, 2024

టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కానున్న డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన టెస్ట్ కెరీర్‌కు ముగింపు పలకనున్నాడు. రాబోయే ఆస్ట్రేలియా వేసవిలో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు శనివారం ప్రకటించాడు. వార్నర్ ప్రస్తుతం ఇంగ్లండ్లో ఈ నెల 7వ తేదీన భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కు సిద్ధమవుతున్నాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జూన్ 16న ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో అతను పాల్గొనే అవకాశం ఉంది. అక్టోబర్-నవంబర్‌లో భారతదేశంలో జరిగే ODI ప్రపంచ కప్ కూడా వార్నర్ ఎజెండాలో ఉంది. అయితే వార్న‌ర్ జనవరి 2024లో పాకిస్తాన్‌తో సిడ్నీలోని తన సొంత మైదానంలో తన టెస్ట్ కెరీర్‌ను ముగించాలనుకుంటున్నట్లు చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement