Thursday, April 25, 2024

టీమ్‌ఇండియాకు మైఖేల్‌ వాన్‌ సవాల్…!

టీమిండియాపై ఎప్పుడు అక్కసు వెళ్లగక్కే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ తన ఓర్వలేని బుద్ధిని మరోసారి బయట పెట్టాడు. అయితే ఈ సారి టీమిండియాను ప్రశ్నిస్తూనే మనోళ్ల సామర్థ్యానికి సవాల్ విసిరాడు. మొదటినుంచి స్పిన్ పిచ్ లపై పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశాడు వాన్‌‌. మూడో టెస్టు రెండు రోజుల్లోనే పూర్తవ్వడం పట్ల ఆ పిచ్‌పై విమర్శలు గుప్పించిన వాన్ తాజాగా పేటీఎం సిరీస్లో నాలుగో టెస్ట్ గెలిచిన అనంతరం టీమిండియాను అభినందించాడు. టెస్టుల్లో టీమ్‌ఇండియా చాలా బాగా మెరుగైందని కొనియాడాడు. అయితే ఆ వెంటనే మరోసారి టీమిండియా సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేశాడు. స్వింగ్‌ బౌలింగ్‌కు అనుకూలించే ఇంగ్లాండ్‌ గడ్డపై టీమ్‌ఇండియా గెలిచినప్పుడు టెస్టుల్లో అత్యుత్తమ జట్టుగా నిలుస్తుందని, అప్పుడు అందులో ఎలాంటి సందేహం ఉండదని వాన్‌ అభిప్రాయపడ్డాడు.

గత మూడు టెస్టుల్లో భారత్‌.. ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఒకవేళ ఇంగ్లాండ్‌లోనూ గెలిస్తే అప్పుడు భారత్‌ ఈ శకంలో అత్యుత్తమ టెస్టు జట్టుగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా జరగాలంటే స్వింగ్‌ బంతులు ఆడటంలో భారత ఆటగాళ్లు కష్టపడాలి’ అని వాన్‌ ట్వీట్‌ చేశాడు. కాగా, జూన్‌లో ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో టీమ్‌ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఆపై ఆగస్టులో ఇంగ్లాండ్‌లోనే ఆ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. దీంతో అక్కడ గెలవాలని వాన్‌ చెప్పకనే చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement