Wednesday, April 24, 2024

జెనీవా : కరోనా కొత్త స్ట్రేయిన్లకు కొత్త పేర్లు : డబ్ల్యుహెచ్ఓ

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా కొత్త రూపాలను సంతరించుకుని మరో భయంకర దాడికి సిద్ధమౌతున్నదన్న సమాచారం నేపథ్యంలో కరోనా కొత్త స్ట్రెయిన్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యుహెచ్ఓ కొత్త పేర్లు పెట్టింది. బ్రిటన్ స్ట్రెయిన్, దక్షిణాఫ్రికా స్ట్రెయిన్, బ్రెజిల్ స్ట్రెయిన్ ఇలా ఒక్కో దేశంలో ఒక్కో కరోనా స్ట్రెయిన్ వెలుగు చూసిన నేపథ్యంలో జెనీవా ఆయా స్ట్రెయిన్లకు నామకరణం చేసింది. కరోనా మహమ్మారి స్ట్రెయిన్లను ఆయా దేశాల పేర్లతో పిలవడం సరికాదని భావించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వాటి కొత్త పేర్లను నిర్ణయించి ప్రకటించనునన్నట్లు పేర్కొంది. అంతే కాకుండా కరోనా మ్యూటేషన్లపై కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలు చేయనున్నది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement