Friday, March 29, 2024

జయ జానకి నాయక రికార్డ్.. 70కోట్ల మంది వీక్షణ

జయ జానకి నాయక చిత్రం అప్పట్లో అట్టర్ ప్లాప్ అయింది. ఈ చిత్రాన్ని మాస్ ద‌ర్శ‌కుడు బోయపాటి తెరకెక్కించాడు. కాగా ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించాడు.ఈ సినిమాను యూట్యూబ్‌లో 700మిలియన్ల మంది అంటే 70 కోట్ల మంది వీక్షించారు.నార్త్‌ ఆడియెన్స్‌కు ఈ సినిమా ఇంకా బాగా కనెక్ట్‌ అయింది. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. తాజాగా ఈ సినిమా ప్రపంచ రికార్డు క్రియేట్‌ చేసింది. ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించిన సినిమాగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు బెల్లంకొండ శ్రీనివాస్‌కు నార్త్‌లో మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన సినిమాలు హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌లకు మిలియన్లలో వ్యూస్‌ ఉన్నాయి. సీతా, కవచం, సాక్ష్యం, స్పీడున్నోడు వంటి సినిమాలకు వందల మిలియన్లలో వ్యూస్‌ సాధించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement