Wednesday, April 24, 2024

చెన్నై : రెండో టెస్టుకు అండర్సన్ దూరం

 భారత్‌-ఇంగ్లండ్‌ రెండో టెస్టుకు ఇంగ్లండ్‌ సీనియర్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ దూరం కానున్నాడు. రొటేషన్‌లో భాగంగా అండర్సన్‌ స్థానంలో స్టువర్ట్‌ బ్రాడ్‌కు అవకాశం ఇవ్వనున్నట్టు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) తెలిపింది. రొటేషన్‌ పాలసీ అమలులో భాగంగా అండర్సన్‌ను తప్పించి బ్రాడ్‌కు అవకాశం కల్పించినట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఇంగ్లండ్‌ హెడ్‌కోచ్‌ క్రిస్‌ సిల్వర్‌ మాట్లాడుతూ తొలిటెస్టులో విజయం సాధించిన జట్టుతోనే రెండో టెస్టు ఆడాలని భావించినా సాధ్యం కాలేదని తెలిపాడు.
రొటేషన్‌ పద్ధతిలో ఆటగాళ్ల ఎంపిక ఉండటంతో తప్పలేదన్నాడు. అయితే అండర్సన్‌ స్థానంలో బ్రాడ్‌ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం వల్ల తర్వాత మ్యాచ్‌లో వారు ఉత్సాహంగా బరిలోకి దిగుతారు. కాగా జోస్‌ బట్లర్‌ స్థానంలో బెయిర్‌స్టో లేదా ఫోక్స్‌ ఆడే అవకాశం ఉంది. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ సమయంలోనే భారత్‌తో తొలి రెండు టెస్టులు ఆడే జట్టును ఇంగ్లండ్‌ ప్రకటించింది. ఫామ్‌లో ఉన్న అండర్సన్‌ తొలి టెస్టు చివరిరోజు గిల్‌, రహానె, పంత్‌ వికెట్లు తీసి భారతజట్టును దెబ్బతీశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement