Thursday, April 25, 2024

గుంటూరులో ‘బుల్లెట్ బండి’ సాంగ్‌కు డ్యాన్స్ వేసిన కార్మికులు

సోషల్ మీడియాలో బుల్లెట్ బండి సాంగ్‌కు వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఈ పాటకు డ్యాన్స్ వేస్తూ పలువురు సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. తాజాగా బుల్లెట్‌ బండి పాట మరోసారి వైరల్‌గా మారింది. ఈసారి పారిశుద్ధ్య కార్మికుల రూపంలో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. పారిశుద్ధ్య కార్మికులు ఎంతలా కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం చెమటను చిందిస్తూ సమాజాన్ని శుభ్రంగా ఉంచుతారు.

అయితే విధి నిర్వహణలో భాగంగా పారిశుధ్య కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి ఇబ్బందులను పోగొడుతూ వారిలో సంతోషాన్ని నింపే ప్రయత్నాన్ని గుంటూరుకు చెందిన అధికారులు చేశారు. ఇందుకోసం వారు బుల్లెట్‌ బండి పాటనే ఎంచుకున్నారు. పని నుంచి రిలీఫ్‌ పొందేందుకు గాను కార్మికులందరినీ లైన్‌లో నిల్చుండబెట్టి వారితో డ్యాన్స్‌ చేయించారు. దీంతో కార్మికులు కూడా వయసును మరిచిపోయి ఎంచక్కా ‘ నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా.. డుగు డుగు డుగు’ అంటూ స్టెప్పులేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement