Thursday, April 25, 2024

కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా సుదీప్.. ఆహ్వానించిన డీకే శివ‌కుమార్..!

తెలుగువారికి ప‌రిచ‌య‌స్తుడే క‌న్న‌డ న‌టుడు కిచ్చా సుదీప్..కాగా క‌న్న‌డ సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటుల్లో సుదీప్ కూడా ఒకరు. 1997 నుంచి సినిమాల్లో నటిస్తున్నారు. కాగా కిచ్చా సుదీప్ తో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ భేటీ అయ్యారు. ఈ వార్త కన్నడ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. బెంగళూరులోని సుదీప్ ఇంటికి శివకుమార్ వెళ్లి.. భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరి సమావేశానికి సంబంధించిన వివరాలు ఇంకా బయటికి రాలేదు. కేవలం మర్యాదపూర్వంగానే సుదీప్ ను శివకుమార్ కలిశారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉండాలని సుదీప్ ను ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement