Thursday, April 25, 2024

ఏపీలో ప్రారంభమయిన ఫ్యాక్ట్‌ చెక్‌ పోర్టల్‌

మీడియా సామాజిక మాధ్యమాలు దురుద్దేశంతో చేస్తున్న ప్రచారాన్ని ఖండించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఫ్యాక్ట్ చెక్ వేదికను ఏర్పాటు చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపి టెక్ వెబ్ సైట్, ట్విట్టర్ ను సీఎం జగన్ ప్రారంభించారు. కొందరు ఉద్దేశ్యపూర్వకంగా
ప్రచారం చేస్తున్నారని ఈ తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో సహా ఏపీ ఫ్యాక్ట్ చెక్ వేదికగా ప్రభుత్వం ఖండిస్తుందని సీఎం తెలిపారు.
దుష్ప్రచారం ఎలా తప్పు ఆధారాలతో సహా చూపించడమే ఫ్యాక్ట్ చెక్ ఉద్దేశమన్నారు సీఎం. ఒక వ్యక్తి లేదా వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతీసే హక్కు ఏ ఒక్కరికి లేదన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారని అలాంటి వాటికి ఎక్కడో ఒకచోట ముగింపు పలకాలని సీఎం అన్నారు. దురుద్దేశ పూర్వకంగా ఈ ప్రచారం మొదట ఎక్కడ నుంచి మొదలైందో దాన్ని గుర్తించి చట్ట ప్రకారం అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement