Thursday, April 25, 2024

ఉత్తరాఖండ్ సీఎం రావత్ రాజీనామా

ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. సీఎం రావత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన మరుసటిరోజే ఈ పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం. దీంతో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే ఆయన సీఎం కుర్చీ నుంచి తప్పుకున్నారని సమాచారం. రావత్ వ్యవహార శైలి, పనితీరు పట్ల సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనే అసంతృప్తి ఉంది. దీంతో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఆయనపై బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ప్రత్యేకించి 10 మంది ఎమ్మెల్యేలతో కూడిన ఒక వర్గం ఆయనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గత వారం ఇద్దరు అబ్జర్వర్లను ఉత్తరాఖండ్ పంపించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రమణ్ సింగ్, ప్రధాన కార్యదర్శి దుశ్యంత్ కుమార్ గౌతమ్ అబ్జర్వర్ల హోదాలో ఉత్తరాఖండ్ వెళ్లారు. రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలను కలిసి వారితో మాట్లాడారు. ఆ నివేదికను బీజేపీ అధిష్టానానికి పంపించగా.. వారు సీఎం రావత్‌ను ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడారు. నివేదిక రావత్‌కు ప్రతికూలంగా ఉండటం వల్లే ఆయన్ను ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. అదే నివేదిక ఆధారంగా అధిష్టానం సీఎం పదవి నుంచి తప్పుకోమని కోరినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా బుధవారం బీజేఎల్సీ సమావేశం జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement