Saturday, April 20, 2024

ఆయకట్టు చివరి భూములకు నీరు

ఎత్తిపోతల పథకాలతో ఆయకట్టు చివరి భూములకు సైతం నీరు అందుతుందని సిఎం కెసిఆర్‌ అన్నారు. ఈ పథకాలతో రైతులకు మరింత మేలు జరుగబోతున్నదని అన్నారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ పర్యటించిన సందర్భంగా నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. అలాగే 13 ఎత్తిపోతల పథకాలు, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. పర్యటనలో భాంగానే డిగ్రీ కళాశాలకు సంబంధించిన 12 శిలాఫలకాల ఆవిష్కరించారు.    హుజూర్‌నగర్‌, సాగర్‌, దేవరకొండ పరిధిలోని చివరి భూములకు నీరు అందుతుందన్నారు. ఎత్తిపోతల ద్వారా యాదాద్రి జిల్లాలో గందమల్ల, బస్వాపూర్‌కు లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు. నాగార్జున సాగర్‌ నియోజకర్గంలో సీఎం కేసీఆర్‌ పర్యటన కొనసాగుతున్నది. నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నాగార్జున సాగర్‌కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం నల్లగొండ జిల్లా పర్యటనకు మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరారు. నందికొండకు చేరుకున్న సీఎంకు ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు ఘనస్వాగతం పలికారు. నందికొండ నుంచి రోడ్డుమార్గాన నెల్లికల్‌కు సీఎం చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement