Friday, April 19, 2024

అల్లు అర్జున్ కి బొమ్మ లారీని గిఫ్ట్ ఇచ్చిన అయాన్.. మురిసిపోతోన్న స్టార్ హీరో

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి స‌ర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు ఆయ‌న త‌న‌యుడు అయాన్. పుష్ప రాజ్ గా బన్నీకి ఇండియా వైడ్ గా ఎంతటి క్రేజ్ వచ్చిందో చూశాం. ఈ క్రమంలో బన్నీకి ఆయ‌న త‌య‌నుడు ఆయాన్ ‘లారీ’(Toy)ని బహుమతిగా అందించారు. దానిపై పుష్ప అనే టైటిల్ కనిపిస్తుంది. భారీ సక్సెస్ ను అందించిన ఈ చిత్ర విజయాన్ని గుర్తు చేస్తూ ఆయాన్ ఇలాంటి గిఫ్ట్ అందించడంతో అల్లు అర్జున్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆయాన్ అందించిన లారీ బొమ్మ ఫొటోను అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ‘నా చిన్నిబాబు అయాన్ నుండి అందమైన బహుమతి #pushpa’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement