Friday, March 29, 2024

అరసవిల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు

శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లిలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అరసవిల్లిలోని సూర్యభగవానుడి ఆలయంలో అర్ధరాత్రి నుంచే వేడుకలు ప్రారంభంఅయ్యాయి.  విశాఖ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి, స్వామి వారికి మహా క్షీరాభిషేకం నిర్వహించారు.  స్వామివారి   దర్శనం కోసం భక్తులు అర్ధరాత్రి నుంచే క్యూలలో వేచి ఉన్నారు.  శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ జె.నివాస్, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, గొర్లె కిరణ్‌కుమార్, వైసీపీ నేతలు మామిడి శ్రీకాంత్, దువ్వాడ శ్రీనివాస్, కిల్లి కృపారాణి దంపతులు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తదితరులు   స్వామి వారిని దర్శించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement