Thursday, September 23, 2021

వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్

వాట్సాప్ యూజర్లు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఓ అదిరిపోయే ఫీచ‌ర్ త్వ‌ర‌లోనే రానుంది. ప్ర‌స్తుతం బీటా వెర్ష‌న్‌లో ఉన్న ఈ ఫీచ‌ర్‌.. అతి త్వ‌ర‌లోనే అంద‌రు యూజ‌ర్ల‌కు అందుబాటులోకి రానున్న‌ట్లు బీటాఇన్ఫో తెలిపింది. ఇన్నాళ్లూ మీ లాస్ట్ సీన్‌, ప్రొఫైల్ పిక్చర్‌, స్టేట‌స్‌ల‌ను ఎవ‌రు చూడాల‌న్నదాంట్లో మూడు ఆప్ష‌న్సే అందుబాటులో ఉన్నాయ‌న్న విష‌యం తెలుసు క‌దా. ఎవ‌రీవ‌న్, మై కాంటాక్ట్స్‌, నోబ‌డీ అనే ఆప్ష‌న్స్ ఉన్నాయి.

దీని ప్ర‌కారం ఎవ‌రీవ‌న్ అంటే ప్ర‌తి ఒక్క‌రూ మీ లాస్ట్ సీన్‌, ప్రొఫైల్ పిక్‌, స్టేట‌స్ చూడొచ్చు. అదే మై కాంటాక్ట్స్ అంటే కేవ‌లం మీ కాంటాక్ట్స్ మాత్ర‌మే చూస్తారు. నోబ‌డీ అంటే ఎవ‌రూ చూడ‌లేరు. కానీ వాట్సాప్ తీసుకొస్తున్న తాజా అప్‌డేట్ ప్రకారం.. మీరు మీ కాంటాక్ట్స్‌లోని వాళ్ల‌లో కూడా కొంద‌రు మీ లాస్ట్ సీన్‌, ప్రొఫైల్ పిక్‌, స్టేట‌స్ చూడ‌కూడ‌ద‌నుకుంటే.. ఆ ప్ర‌కారం సెట్టింగ్స్ మార్చుకోవ‌చ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News