Sunday, May 9, 2021

ముంబై : రూ.2 కోట్ల జాబితాలో భజ్జీ, జాదవ్

 ఐపీఎల్‌ 2021వేలంలో పాల్గొనే 292మంది జాబితా సిద్ధమైంది. కనీసం రూ.2కోట్ల జాబితాలో భారత్‌ నుంచి హర్భజన్‌సింగ్‌, కేదార్‌ జాదవ్‌తోపాటు మరో 8మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఈ జాబితాలో చెన్నైకు ప్రాతినిధ్యం వహించిన భజ్జీ, కేదార్‌ జాదవ్‌ (భారత్‌), రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన స్టీవ్‌స్మిత్‌ (ఆస్ట్రేలియా), కింగ్స్‌ ఎలెవన్‌కు చెందిన మ్యాక్స్‌వెల్‌ (ఆస్ట్రేలియా), సన్‌రైజర్స్‌కు చెందిన షకీబ్‌ అల్‌ హాసన్‌ (బంగ్లాదేశ్‌), ఢిల్లిd క్యాపిటల్స్‌కు ఆడిన సామ్‌ బిల్లింగ్స్‌, ప్లంకెట్‌, జేసన్‌ రాయ్‌ (ఇంగ్లండ్‌), సీఎస్కే తరఫున ఆడిన మార్క్‌వుడ్‌ (ఇంగ్లండ్‌), ఆర్సీబీ తరఫున ఆడిన మొయిన్‌ అలీ (ఇంగ్లండ్‌) ఉన్నారు. ఈ నెల 18న చెన్నై వేదికగా వేలం జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Prabha News