Friday, June 25, 2021

బ్యాగులు సర్దుకొండి..ఆస్ట్రేలియాకు నేను పంపిస్తా: సోనూ సూద్‌

క‌రోనా మ‌హమ్మారి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కూ అంద‌రికీ ఆప‌న్న‌హ‌స్తం అందిస్తున్నాడు న‌టుడు సోనూ సూద్‌. ఈ క‌ష్ట‌కాలంలో అత‌న్ని అడిగితే చాలు ఏ సాయ‌మైనా చేస్తాడ‌న్న న‌మ్మ‌కం జ‌నాల్లో వచ్చేసింది. దీని ఆధారంగానే రూపొందించిన ఓ కార్టూన్ వైర‌ల్ అయింది. ఐపీఎల్ అర్ధాంతరంగా ఆగిపోవటం తో ఆస్ట్రేలియా కి వెళ్లాల్సిన ఆదేశ క్రికెటర్లు మాల్దీవుల్లో ఉండిపోయారు. వారు ఆస్ట్రేలియా కి కి వెళ్లడానికి ఇంకా కొన్ని రోజులు సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట‌ర్లు తాము ఇంటికి వెళ్ల‌డానికి సాయం చేయాల్సిందిగా సోనూ సూద్‌కు మెసేజ్ చేసిన‌ట్లుగా కార్టూనిస్ట్ చిత్రీక‌రించారు.

ఈ కార్టూన్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేసిన ఓ వ్య‌క్తి.. సోనూ సూద్‌ను ట్యాగ్ చేశాడు. భాయ్‌.. ఈ ఆసీస్‌ను ఇంటికి పంపించ‌గ‌ల‌వా అని అడిగాడు. దీనిపై సోనూ కూడా స‌ర‌దాగా స్పందించాడు. వెంట‌నే మీ బ్యాగుల‌ను ప్యాక్ చేసుకోండి అని కామెంట్ చేస్తూ.. ఫ‌న్నీ ఎమోజీల‌ను పోస్ట్ చేశాడు. ఈ మ‌ధ్యే క్రికెట‌ర్ సురేశ్ రైనా కూడా త‌న ఆంటీకి ఆక్సిజ‌న్ అవ‌స‌ర‌మున్న‌ద‌ని అడిగితే.. వెంట‌నే స్పందించిన సోనూ సూద్ సాయం చేసిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Prabha News