Saturday, April 17, 2021

బంగాళాఖాతంలో టీడీపీ విలీనం!

తెలంగాణలో టీడీపీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు అధికార టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్‌తో సమావేశమైన ఎమ్మెల్యే నాగేశ్వరరావు.. అధికారికంగా టీఆర్ఎస్‌లో చేరారు. టీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. టీడీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీఆర్ఎస్ లో తెలంగాణ టీడీపీ విలీనమైందని.. ఏపీలో టీడీపీని బంగాళాఖాతంలో  విలీనం చేయాలసిందేనని అన్నారు. ” లేకపోతే కృష్ణార్పణమో, గోదావరిలో నిమజ్జనం చేస్తారా? పప్పు  నాయకత్వంలో జాతీయ పార్టీని చేయాలనుకున్న చంద్రంకు ఇక నిరాశా, నిస్పృహే. చాలా రాష్ట్రాలకు డబ్బు మూటలు పంపించాడే! అవి ఏమైనట్లు?’’ అని ట్వీట్ చేశారు.

‘’జగన్ గారు ఎన్ని ఉద్యోగాలిచ్చారో మీ బాబును, కుల మీడియాను అడుగు మాలోకం. నీతో చర్చ ఏంటి మరీ అసహ్యంగా. చిన్న మెదడు డ్యామేజి అయినోడివి ఏదైనా అంటావు. ఖర్మ కాకపోతే ఆ దిక్కుమాలిన పార్టికి నువ్వో ‘పెద్ద’ నాయకుడివి. జెండా పీకేసే ముందు ఇలాంటి ఎమోషన్స్ మామూలే’’అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News