Wednesday, March 29, 2023

ప్రభాస్ ‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్ ప్రకటన

యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్‌‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ అయ్యాక మరింత స్పీడు పెంచి వరుస పెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇక ఇందులో ముఖ్యంగా ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్నాడు‌. రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ చేస్తున్నారు. ఆ పాత్ర పేరుని లంకేష్ అని ప్రకటించారు కూడా. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ దశలోనే ఉంది. అయితే తాజాగా ఆదిపురుష్ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఆగస్ట్‌ 11న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement