Monday, December 9, 2024

నాలుగో టెస్ట్: లంచ్ బ్రేక్‌కు ఇంగ్లండ్ 3 వికెట్లు డౌన్

అహ్మదాబాద్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్ గెలిచి రూట్ సేన బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు లంచ్ సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ ధాటికి ఓపెనర్లు క్రాలే (9), సిబ్లే (2) తక్కువ స్కోర్లుకే పెవిలియన్ చేరారు. కీలకమైన రూట్(5) వికెట్‌ను హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ పడగొట్టాడు. దీంతో 30 పరుగులకే ఇంగ్లండ్ జట్టు మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది. అనంతరం బెయిర్ స్టో (28 బ్యాటింగ్), బెన్ స్టోక్స్ (24 బ్యాటింగ్) పోరాడుతున్నారు. కాగా ఈ టెస్టులో బుమ్రా స్థానంలో భారత్ మహ్మద్ సిరాజ్‌కు స్థానం కల్పించింది. అటు ఇంగ్లండ్ జట్టు ఆర్చర్, బ్రాడ్ స్థానాల్లో లారెన్స్, బెస్‌లను తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement